మెగాస్టార్ చిరంజీవి భార్య సురేఖతో కలిసి రెండు రోజుల క్రితం అమెరికాకు వెళ్లిన విషయం తెలిసిందే. అక్కడ కొన్ని శుభకార్యాలలో పాల్గొంటున్నారు. నిన్న తన మిత్రుడు ఎన్అర్ఐ కుమార్ కోనేరు కుమారుడు కిరణ్ కోనేరు, శైల్య శ్రీల వివాహ వేడుకలకు హజరయ్యానంటూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టగా ఆ ఫొటోలు బాగా వైరల్ అయ్యాయి.
తాజాగా ఆ వివాహా వేడుకలో చిరంజీవి సాంప్రదాయ దుస్తులు ధరించి అతిధులందరితో కలిసి కూర్చోని ఉన్న ఓ ఫొటో ఇప్పుడు నెట్టింట బాగా వైరల్ అవుతోంది.ఆ ఫొటోలో చిరంజీవితో పాటు విక్టరీ వెంకటేశ్ మరి కొంత మంది ప్రముఖులు కూడా ఉన్నారు.