AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఎన్నికల కోడ్ రాకముందే పసుపు బోర్డుపై స్పష్టత ఇవ్వాలి: తుమ్మల

జాతీయ పసుపు బోర్డును రాష్ట్రంలో వెంటనే ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడం జరిగిందని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. ఈ మేరకు ఆదివారం ప్రధాని మోడీకి మంత్రి తుమ్మల నాగేశ్వర రావు లేఖను రాశారు. రాష్ట్రంలో పసుపు బోర్డు ఏర్పాటు పసుపు రైతుల చిరకాల ఆకాంక్ష అని, గత పార్లమెంట్ ఎన్నికల్లో రైతులు పెద్ద ఎత్తున నిజామాబాద్ ఎంపీ స్థానానికి నామినేషన్లు వేసి నిరసన చేశారని గుర్తు చేశారు. దీంతో ప్రభుత్వం స్పందించి పసుపు బోర్డు ఏర్పాటుకు హామీ ఇచ్చిందని, బోర్డు ఏర్పాటుకు కూడా గెజిట్ విడుదల చేసిందని లేఖలో ప్రస్తవించారు.

అందులో ఎక్కడ పసుపు బోర్డు ఏర్పాటు చేసే ప్రదేశం, బడ్జెట్ లేదని, కేవలం కమిటీ సభ్యుల నియామకం వివరాలను గెజిట్‌లో పేర్కొన్నారని చెప్పారు. కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం పసుపు బోర్డు ప్రయోజనాలపై ప్రయత్నాలను ముమ్మరం చేసిందని అన్నారు. రైతులను బలోపేతం చేయడం, పసుపు ధరల స్థిరీకరణ, అవకాశాలు పెంచడంతో ఎంతో మేలు జరుగుతుందని పేర్కొన్నారు. ప్రతి ఏటా రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరిగిపోతోందని, వెంటనే రాష్ట్రంలో పసుపు బోర్డు ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని కోరారు. ఎన్నికల కోడ్ అమల్లోకి రాకముందే బోర్డు ఏర్పాటుపై స్పష్టత ఇవ్వాలని ప్రధానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాసిన లేఖలో గుర్తుచేశారు.

ANN TOP 10