ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కష్టపడే ఎమ్మెల్యే హరీష్ రావు బీఆర్‌ఎస్ పార్టీలో భవిష్యత్తు లేదని వ్యాఖ్యానించారు. సోమవారం చిట్ చాట్ మాట్లాడుతూ.. అందులో హరీష్‌కు భవిష్యతు లేదని కాంగ్రెస్ రావాలని అన్నారు. 20 మంది ఎమ్మెల్యేలను తీసుకు వస్తే హరీష్ రావుకు మంత్రి పదవి ఇస్తామని వ్యాఖ్యానించారు. హరీష్ రావుకు దేవాదాయ శాఖ ఇస్తామని, అప్పుడైనా ఆయన చేసిన పాపాలు కడుక్కోవచ్చని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. కడియం శ్రీహరి, హరీష్ రావులా తాము జీ హుజుర్ బ్యాచ్ కాదని అన్నారు. కడియం శ్రీహరి, హరీష్ రావు మమ్మల్ని చీల్చాలని సూచిస్తున్నారని మండిపడ్డారు. మేం పదవుల కోసం కాదని, ప్రజల కోసం ఉన్నామని చెప్పారు. బీఆర్ఎస్ చీప్ పాలిటిక్స్ మానుకోవాలని, తెలంగాణను కేసీఆర్ నాశనం చేశారని అన్నారు. రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత తామపై ఉందని, బీఆర్‌ఎస్ నల్గొండ సభ అట్టర్ ఫ్లాప్ అవుతుందని రాజగోపాల్ రెడ్డి అన్నారు.
