AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

విశ్వాస పరీక్షలో నెగ్గిన నితీష్ కుమార్

బీహార్ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టించిన నితీష్ కుమార్ ప్రభుత్వాన్ని నిలబెట్టుకున్నారు. సోమవారం నిర్వహించిన విశ్వాస పరీక్షలో నితీష్ కుమార్ నెగ్గారు. విశ్వాస పరీక్షలో నితీష్‌కు మద్ధతుగా 129 మంది ఎమ్మెల్యేలు ఓటు వేశారు. బిహార్‌లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. అధికారం దిక్కించుకోవాలంటే 122 సీట్లు కావాలి. దీంతో నితీష్ కుమార్ మ్యాజిక్ ఫిగర్ ధాటి విశ్వాస పరీక్షను నెగ్గారు. ఈ సమయంలో నితీష్ వర్గం కుట్ర చేస్తుందని ఆరోపిస్తూ విపక్ష పార్టీలు సభ నుంచి వాకౌట్ చేశాయి. సభలో ఉన్న 129 మంది సభ్యులు నితీష్‌కు మద్దతు రావడంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అసెంబ్లీతో తొలుత గవర్నర్ ప్రసంగం తర్వాత ఆర్జేడీకి చెందిన స్పీకర్ అవాథ్ బిహారీ చౌదరిపై అధికార పక్షం అవిశ్వాస తీర్మానం పెట్టారు. తీర్మాణానికి అనుకూలంగా 125 ఓట్లు రావడంతో స్పీకర్‌ను తొలగించారు. ఇక త్వరాలోనే కొత్త స్పీకర్‌ను ఎన్నుకోనున్నారు.

గత కొద్ది రోజుల క్రితం విపక్షాల ఇండియా కూటమికి నితీష్ గుడ్ బై చెప్పారు. 2022లో బీజేపీతో తెరదెంపులు తెచ్చుకుని ఆర్జేడీ, కాంగ్రెస్‌తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు మళ్లీ బీజేపీ ఎన్డీఏ కూటమితో దోస్తీకి సిద్ధమయ్యారు. అదే రోజు తొమ్మిదో సారి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన నితీష్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను విపక్షాల కూటమైన ఇండియాలో ఉండడం కాంగ్రెస్‌కు ఇష్టం లేదని ఆరోపించారు. ఆ సమయంలో నా నాయకత్వంపై కాంగ్రెస్ నచ్చలేదని అన్నారు. ఇండియా కూటమి కోసం చాలా కష్టపడ్డానని, విపక్షాలను ఏకం చేస్తుంటే తనను ఇబ్బంది పెట్టినట్లు పేర్కొన్నారు. లాలు ప్రసాద్ కూడా తనకు వ్యతిరేకంగా వ్యవహరించారని నితీష్ కుమార్ చెప్పారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10