తెలంగాణ నిరుద్యోగులకు ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగ నియామకాల వయోపరిమితి వయస్సు రెండేళ్లు పెంచింది. అభ్యర్థుల వయోపరిమితి 44 ఏళ్ల నుంచి 46 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. యూనిఫామ్ సర్వీస్ మినహాయిస్తూ వయోపరిమితిని సడలింపు చేసింది. గత ప్రభుత్వం గరిష్ట వయోపరిమితిని 34 ఏళ్ల నుంచి 44 ఏళ్లకు (10 సంవత్సరాలు) పెంచింది. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం రెండు ఏళ్లు పెంచింది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది. రెండేళ్ల పాటు అమలు చేయనున్నట్లు తెలిపింది.
