అండర్ 19 ప్రపంచ కప్‌లో భాగంగా ఆదివారం టీమిండియా, ఆస్ట్రేలియా జట్లు ఫైనల్ పోరుకు దిగాయి. దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచింది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకోగా.. తన ప్రత్యర్థి టీమిండియాను బౌలింగ్‌కు ఆహ్వనించింది. బ్యాట్ పట్టి మైదానంలోకి వచ్చిన ఆస్ట్రేలియా ఓపెనర్ వికెట్ తీసి కాస్త టెన్షన్ పెట్టించారు. సామ్ కాన్స్టాస్ (0) డకౌట్ అయ్యాడు. దీంతో మరో ఓపెనర్ హ్యారీ డిక్సన్, హ్యూ వీబ్‌జెస్‌తో భాగస్వామ్యంలో మంచి పరుగులు రాణించారు. హ్యారీ డిక్సన్ (42), హ్యూ వీబ్‌జెస్ (48) పరుగులు చేయడంతో ఆస్ట్రేలియా మంచి స్కోరు దిశగా సాగింది. వీరిద్దరి భాగస్వామ్యం బలపడుతున్న సమయంలో ఆస్ట్రేలియా (92) పరుగులు వద్ద రెండో వికెట్ కోల్పోయింది. హ్యూ వీబ్‌జెస్, హ్యారీ డిక్సన్‌లు వెంట వెంటనే వికెట్లు కోల్పోయారు. టీమిండియా బౌలర్ నమన్ తివారీ వారిని ఔట్ చేశాడు.
అనంతరం వచ్చిన హర్జాస్ సింగ్ అచితూచి వ్యవహరించి ఆడాడు. హర్జాస్ సింగ్ (55) పరుగులు చేసి మైదానం విడిచాడు. ఆ సమయంలో ఆస్ట్రేలియా 4 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. ర్యాస్ హిల్స్ (20), రాఫ్ మాక్ మిల్లన్ (2) పరుగులు చేసి వికెట్లు కోల్పోయారు. ఆ సమయంలో ఆస్ట్రేలియా తీవ్ర కష్టాల్లో పడింది. చివర్లో వచ్చిన ఆలివర్ పీక్ దూకుడుగా ఆడి (46), చార్లీ అండర్సన్ (13) పరుగులు చేశారు. దీంతో ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లకు 253 పరుగులు చేసింది. ఇందులో టీమిండియా బౌలర్లు రాజ్ లింబాని 3, నమన్ తివారీ 2 వికెట్లు తీశాడు. అలాగే ముషీర్ ఖాన్, సౌమీ పాండేలు తలా ఒక వికెట్ తీశారు. ఇక టీమిండియా 254 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి రానుంది.
తుది జట్ల వివరాలు
టీమిండియా అండర్ 19 జట్టు: ఆదర్శ్ సింగ్, అర్షిన్ కులకర్ణి, ముషీర్ ఖాన్, ఉదయ్ సహారన్ ( సీ), ప్రియాంషు మోలియా, సచిన్ దాస్, అరవెల్లి అవనీష్ ( డబ్ల్యూకే ), మురుగన్ అభిషేక్, రాజ్ లింబాని, నమన్ తివారీ, సౌమీ పాండే
ఆస్ట్రేలియా అండర్ 19 జట్టు: హ్యారీ డిక్సన్, సామ్ కాన్స్టాస్, హ్యూ వీబ్‌జెన్ (c), హర్జాస్ సింగ్, ర్యాన్ హిక్స్ (డబ్ల్యూకే), ఆలివర్ పీక్, చార్లీ ఆండర్సన్, రాఫ్ మాక్‌మిల్లన్, టామ్ స్ట్రాకర్, మహ్లీ బార్డ్‌మాన్, కల్లమ్ విడ్లర్