AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

సీఎంపై అనుచిత వ్యాఖ్యలు.. బల్క సుమన్‌కు నోటీసులు

ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణల నేపథ్యంలో మంచిర్యాల జిల్లా పోలీసులు బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే బల్క సుమన్‌కు నోటీసులు అందజేశారు. గత కొద్ది రోజుల కిందట బీఅర్ఏస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో బల్క సుమన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు రాజకీయంగా ప్రకంపనలు రేపాయి. ఆ తర్వాత దీనిపై స్థానిక కాంగ్రెస్ నాయకుల ఫిర్యాదు మేరకు మంచిర్యాల పోలీసులు 294B, 504, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రభుత్వం అక్రమంగా తన మీద కేసు నమోదు చేసిందని బల్క సుమన్ ఆరోపించారు. హైదరాబాద్ శివారు చల్లాపూర్‌లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నోటీసులు తీసుకుని పోలీసుల విచారణకు సహకరిస్తానని చెప్పారు. నోటీసులు అందుకున్న ఆయన వాటిపై సంతకం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా తన మీద కేసు నమోదు చేసిందని ఆరోపించారు. ఉద్యమంలో ఎన్నో కేసులను ఎదుర్కొని పోరాటం చేసిన పార్టీ తమదని, కచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చే దాకా ప్రజల పక్షాన పోరాటం చేస్తామని ట్విట్టర్ (ఎక్స్) వేదికగా చెప్పారు.

కేసులకు భయపడే సమస్య లేదని ప్రజల పక్షాన పోరాటం కొనసాగుతుందన్నారు. అధికారం కోసం ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చి గద్దెనెక్కారని, వాటిని అమలు పరచాల్సిన బాధ్యత ముఖ్యమంత్రితో పాటు ప్రభుత్వంపై ఉందన్నారు. ప్రజల పక్షాన రాజీలేని పోరాటం చేయడమే తమ అధినేత కేసీఆర్ తమకు నేర్పారని బల్క సుమన్ అన్నారు. వారం రోజుల క్రితం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని తీవ్ర పదజాలంతో దూషిస్తూ చేసిన వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. అయితే కేసీఆర్ విమర్శించిన రేవంత్ రెడ్డికి తన చెప్పును చూపిస్తూ కొడతానంటూ వివాదాస్పద ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ఆయనపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ శ్రేణులు. రాష్ట్రవ్యాప్తంగా పలు స్టేషన్లలో ఫిర్యాదులు కూడా ఇచ్చారు. అందులో భాగంగానే మంచిర్యాల పోలీసులు కేసు నమోదు చేశారు.

ANN TOP 10