AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఎడ్‌సెట్‌ నోటిఫికేషన్‌ మార్చి 4న.. మే 23న రెండు సెషన్లలో పరీక్ష

రెండేండ్ల బీఈడీ కోర్సులో ప్రవేశానికి నిర్వహించే టీఎస్‌ ఎడ్‌సెట్‌-24 పరీక్ష షెడ్యూల్‌ విడుదలైంది. 2024-25 విద్యా సంవత్సరంలో ప్రవేశాలు కల్పించే ఎడ్‌సెడ్‌ మొదటి సెట్‌ కమిటీ సమావేశం శనివారం ఉన్నత విద్యామండలి కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశంలో కమిటీ సమగ్రంగా చర్చించి, షెడ్యూల్‌ను విడుదల చేసింది. మార్చి 4న ఎడ్‌సెట్‌ నోటిఫికేషన్‌ను విడుదల చేయాలని, అదే నెల 6 నుంచి దరఖాస్తులను స్వీకరించాలని నిర్ణయించారు. ఇదే సమావేశంలో టీఎస్‌ ఎడ్‌సెట్‌ సిలబస్‌లో స్వల్పమార్పులు చేశారు. పాతవాటిని తొలగించకుండా, కొన్ని వర్తమాన అంశాలను సిలబస్‌లో చేరుస్తూ ఆమోదించారు.

జనరల్‌ నాలెడ్జిలో (జీకే) విభాగంలో న్యూ ఇష్యూస్‌ ఇన్‌ ఎడ్యుకేషన్‌, ఎన్‌ఈపీ వంటి అంశాలను చేర్చారు. కంపూటర్స్‌ బేసిక్స్‌లో ఆర్టీఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, మెషిన్‌లెర్నింగ్‌, జనరల్‌ ఇగ్లిష్‌, టీచింగ్‌ ఆప్టిట్యూడ్‌లో కొన్ని అంశాలను అదనంగా చేర్చారు. పరీక్షలో భాగంగా 1-10వ తరగతి వరకు ఉన్న సబ్జెక్టుల్లోని అంశాలపైనే ప్రశ్నలు అడుగుతారు. సమావేశంలో ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ ఆర్‌ లింబాద్రి, వైస్‌ చైర్మన్లు ప్రొఫెసర్‌ వెంకటరమణ, ఎస్కే మహమూద్‌, మహత్మాగాంధీ వర్సిటీ వీసీ ప్రొఫెసర్‌ గోపాల్‌రెడ్డి, ఉన్నత విద్యామండలి కార్యదర్శి శ్రీరాం వెంకటేశ్‌, ఎడ్‌సెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ మృణాళిని పాల్గొన్నారు.

మే 11న ఎన్సీహెచ్‌ఎం జేఈఈ ఎగ్జామ్‌
హైదరాబాద్‌, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ): జాతీయంగా హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ జాయింట్‌ ఎంట్రెన్స్‌ ఎగ్జామినేషన్‌ (ఎన్సీహెచ్‌ఎం జేఈఈ) షెడ్యూల్‌ విడుదలైంది. ఈ పరీక్షను మే 11న జాతీయ స్థాయిలో నిర్వహిస్తారు. దరఖాస్తుల స్వీకరణ ఇప్పటికే ప్రారంభంకాగా, మార్చి 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని ఎన్టీఏ వెల్లడించింది.

ANN TOP 10