AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మూసీ అభివృద్ధికి రూ.1000 కోట్లు.. విద్యారంగానికి 21,389 కోట్లు

హైదరాబాద్‌: 2024-25 ఆర్థిక సంవత్సరానికిగాను రూ.2,75,891 కోట్లతో మంత్రి భట్టువిక్రమార్క (Minister Bhatti Vikramarka) బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఇందులో మూసీ అభివృద్ధికి (Moosi Development) రూ.1000 కోట్లు ప్రతిపాదించారు. హైదరాబాద్‌ మెడలో అందమైన హారంలా మూసీ నదిని తీర్చిదిద్దుతామని చెప్పారు. మూసీ రివర్‌ ఫ్రంట్‌ డెవలప్‌మెంటు ప్రాజెక్టులో భాగంగా పాదచారుల జోన్లు, పీపుల్స్‌ ప్లాజాలు, ఓల్డ్‌ సిటీలోని హెరిటేజ్‌ జోన్లు, హాకర్స్‌ జోన్లు, చిల్డ్రన్స్‌ థీమ్స్‌ పార్కులు, ఎంటర్‌టైన్‌మెంట్‌ జోన్లు అభివృద్ధి చేస్తామన్నారు.

మూసీ నదిని, నదీ తీరాన్ని ఒక పర్యావరణహిత పద్ధతిలో సమగ్ర ప్రణాళికతో అద్భుతంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. సాంస్కృతిక కట్టడాల పరిరక్షణ కూడా ఇందులో భాగంగా అమలు చేస్తామని తెలిపారు. భవిష్యత్తులో ఈ ప్రాజెక్టు చార్మినార్ హైటెక్‌సిటీ, సాలార్‌జంగ్‌ మ్యూజియం వంటి పర్యాటక స్థలాలతో పోటీపడుతుందనడంతో ఎలాంటి సందేహం లేదన్నారు.

విద్యారంగానికి 21,389 కోట్లు వచ్చే ఆర్థిక సంవత్సరానికిగాను రూ.2,75,891 కోట్లతో మంత్రి భట్టువిక్రమార్క (Minister Bhatti Vikramarka) బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఇందులో విద్యా రంగానికి రూ.21,389 కోట్లు ప్రతిపాదించారు.

విద్యారంగానికి 21,389 కోట్లు
విద్యా రంగానికి రూ.21,389 కోట్లు ప్రతిపాదించారు. ఇందులో విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్యను ప్రోహించేందుకుగాను మౌలిక సదుపాయాల కల్పనకు రూ.500 కోట్లు, తెలంగాణ పబ్లిక్‌ స్కూల్స్‌ ఏర్పాటుకు రూ.500 కోట్లు కేటాయించారు.

రాష్ట్రాన్ని ఎడ్యుకేషన్‌ హబ్‌గా తయారు చేయాలన్న ప్రభుత్వ సంకల్పమని చెప్పారు. విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లను సకాలంలో అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. సాంకేతిక విద్యను మరింత పటిష్ఠంగా, పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా సమాయత్తం చేడయానికి రాష్ట్రంలోని 65 ఐటీఐలను ప్రైవేటు సంస్థల భాగస్వామ్యంలో స్కిల్‌ సెంటర్లుగా అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. అదేవిధంగా స్కిల్‌ యూనివర్సిటీల ఏర్పాటుపై ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని తెలిపారు.

ANN TOP 10