బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ నేపాల్లో ఉన్నట్లుగా తెలంగాణ పోలీసులు గుర్తించినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న బాల్క సుమన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తన చెప్పును చూపిస్తూ… సీఎంను కొడతానంటూ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనపై కేసు నమోదయింది.
అప్పటి నుంచి ఆయన కనిపించడం లేదని చెబుతున్నారు. ఆయన పరారీలో ఉండటంతో పోలీసులు గాలిస్తున్నారు. బాల్క సుమన్ హైదరాబాద్ నుంచి మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్ మీదుగా నేపాల్లోని ఖాట్మాండుకు వెళ్లినట్లుగా గుర్తించారని వార్తలు వస్తున్నాయి. ఖాట్మాండులోని ఓ ప్రాంతంలో పబ్లో ఆయనను గుర్తించినట్లుగా వార్తలు వస్తున్నాయి.









