అసెంబ్లీలో శనివారం మధ్యాహ్నం 12 గంటలకు తెలంగాణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ మేరకు స్పీకర్ ప్రసాద్ కుమార్ ప్రకటించారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి శాసనసభ ఆమోదం తెలిపింది. అనంతరం సభను వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. శనివారం మధ్యాహ్నం 12 గంటలకు సభ తిరిగి ప్రారంభమవుతుందని తెలిపారు. సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. నేడు ఉదయం 9 గంటలకు కేబినెట్ సమావేశమై బడ్జెట్‌కు ఆమోదం తెలుపనుంది.









