AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కేసీఆర్, కేటీఆర్‌లకు హరీశ్ రావు నుంచి వెన్నుపోటు ఖాయం

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్‌ పార్టీలో జరిగే అంతర్యుద్ధంలో మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు, మాజీ మంత్రి కేటీఆర్‌కు సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు వెన్నుపోటు పొడవడం ఖాయమన్నారు. కేసీఆర్‌కు, కేటీఆర్‌కు వెన్నుపోటు పొడిచేందుకు కాంగ్రెస్ పార్టీ అవసరం లేదన్నారు. వారికి హరీశ్ రావు మాత్రమే వెన్నుపోటు పొడుస్తారన్నారు. ఇక మేం (మీకు వెన్నుపోటు పొడిచేందుకు) అవసరం లేదన్నారు. మేం ఎంత మంచి పనులు చేస్తున్నప్పటికీ మీరు విమర్శలు చేయడం విడ్డూరమన్నారు.

ANN TOP 10