AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

నీటి పారుద‌ల శాఖ‌లో భారీ ప్ర‌క్షాళ‌న‌..

రాజీనామా చేయాల‌ని ఈఎన్సీ ముర‌ళీధ‌ర్‌కు ఉత్త‌మ్ ఆదేశం
హైద‌రాబాద్ : తెలంగాణ నీటి పారుద‌ల శాఖ‌లో ప్ర‌భుత్వం భారీ ప్ర‌క్షాళ‌న చేప‌ట్టింది. ఈఎన్సీ ముర‌ళీధ‌ర్ రావు రాజీనామా చేయాల‌ని నీటి పారుద‌ల శాఖ మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. రామ‌గుండం ఈఎన్సీ, కాళేశ్వ‌రం ఈఎన్సీ ఇంచార్జి వెంక‌టేశ్వ‌ర్ రావును స‌ర్వీసు నుంచి తొల‌గిస్తూ ఉత్త‌మ్ ఆదేశాలు జారీ చేశారు. మ‌రికొంత మంది ఇంజినీర్ల‌పైనా కూడా ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంది. మేడిగ‌డ్డ‌పై విజిలెన్స్ నివేదిక ఆధారంగా ఇంజినీర్ల‌పై ప్ర‌భుత్వం చర్యలు తీసుకున్నారు.

ANN TOP 10