AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

పొమ్మనలేక పొగపెట్టారు .. బీజేపీకి బాబుమోహన్ రాజీనామా

బీజేపీకి మాజీ మంత్రి బాబుమోహన్ రాజీనామా చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకత్వంపై ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తనను వాడుకుని బీజేపీ పొమ్మనలేక పొగ పెడ్తోందని ఆరోపణలు చేశారు. ఆందోల్ నియోజకవర్గం నుంచి 2018, 2023లో బీజేపీ తరఫున ఎమ్మెల్యేగా బాబుమోహన్ పోటీ చేశారు.

అందుకే రాజీనామా..
తాజాగా వరంగల్ ఎంపీ టికెట్ బాబుమోహన్ ఆశించారు. అయితే వరంగల్ టికెట్ బాబుమోహన్‌కు ఇచ్చేందుకు కమలంపార్టీ నిరాకరించింది. దీంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ బీజేపీకి బాబు మోహన్ గుడ్‌బై చెప్పేశారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఆందోల్ టికెట్‌ను బాబుమోహన్ కుమారుడు ఉదయ్ మోహన్‌కు ఇవ్వాలని బీజేపీ భావించింది. అయితే తమ కుటుంబంలో బీజేపీ చిచ్చు పెడుతోందని మాజీ మంత్రి ఆరోపించారు. దీంతో బీజేపీ చివరి నిమిషంలో ఆందోల్ టికెట్‌కు బాబూమోహన్‌కు ఇచ్చిన విషయం తెలిసిందే.

ANN TOP 10