AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రూ. 2.86 లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్

విద్య, వైద్య రంగాల్లో 3,376 కోట్ల రూపాయల వ్యయంతో జగనన్న విద్యా కానుకను 47 లక్షల మంది విద్యార్థులకు అందచేశామని మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి అన్నారు. బుధవారం శాసనసభలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. రూ. 2.86,389 కోట్లతో బడ్జెట్‌ను రూపొందించారు. ఇందులో రెవెన్యూ వ్యయం రూ.2,30,110 కోట్లు, మూలధన వ్యయం రూ.30,530 కోట్లుగా పేర్కొన్నారు. ద్రవ్యలోటు రూ.55,817 కోట్లు ఉండగా.. రెవెన్యూ లోటు రూ.24,758 కోట్లు ఉందని తెలిపారు. అలాగే జీఎస్డీపీలో రెవెన్యూ లోటు 1.56 శాతం, జీఎస్డీపీలో ద్రవ్యలోటు 3.51 శాతంగా ఉందన్నారు. ఈ సందర్భంగా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ.. సుపరిపాలన, సామర్థ్య ఆంధ్ర, మహిళలు, సంపన్నులు, సంక్షేమ, భూభద్ర, అన్నపూర్ణ ఆంధ్ర అటూ ఏడు అంశాలను తీసుకుని బడ్జెట్‌ను రూపొందించామని ఆయన చెప్పారు. ప్రతి గడపకూ సంక్షేమ కార్యక్రమాలను తమ ప్రభుత్వం అందించిందన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 1.3 లక్షల మందికి సచివాలయంలో ఉద్యోగాలను కల్పించామని, 2.6 లక్షల మందిని వాలంటీర్లుగా నియమించామని వివరించారు.

ప్రతి జిల్లాలో దిశ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేసి మహిళలకు రక్షణగా నిలిచామని స్పష్టం చేశారు. విద్యారంగంలో సంస్కరణలను తీసుకు వచ్చి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశ పెట్టామని, వెయ్యి పాఠశాలల్లో సీబీఎస్‌ఈ సిలబస్‌ను పెట్టామని గుర్తు చేశారు. ప్రపంచంలో పోటీని తట్టుకునే విధంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ఆరోగ్యశ్రీ పరిమితిని 25 లక్షలకు పెంచామని, అలాగే ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఆసుపత్రుల్లో కూడా చికిత్స చేయించుకునే వీలును కల్పించామని పేర్కొన్నారు. కుప్పంతో సహా కొత్త రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేశామని, కొత్త జిల్లాలను ఏర్పాటు చేసి ప్రజలకు పాలనను మరింత చేరువను చేశామని తెలిపారు. అంబేద్కర్ ఆశయాలే తమ ప్రభుత్వానికి స్ఫూర్తి అని వెల్లడించారు. వివిధ కార్పొరేషన్ల ద్వారా అనేక మంది అబ్దిదారులకు ఆర్థిక సాయం అందించి ఆసరాగా ఈ ప్రభుత్వం నిలిచిందన్నారు. ఆర్థిక వ్యవస్థలో మహిళలను సమాన భాగస్వామ్యులను చేశామని, విద్య, వైద్య రంగాల్లో తమ ప్రభుత్వం కనపర్చిన శ్రద్ధ గతంలో మరే ప్రభుత్వం కనపర్చలేదన్నారు. జిల్లాకు ఒక మెడికల్ కళాశాలను ఏర్పాటు చేశామని, ఉచాల దాత్యుల్లు పై 37,374 కోట్ల సబ్సిడీ ఇచ్చామని మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి పేర్కొన్నారు.

ANN TOP 10