ఓ మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినందుకు మియాపూర్ ఇన్‌స్పెక్టర్ ప్రేమ్‌కుమార్(Miyapur Inspector Premkumar)ను సైబరాబాద్ సీపీ సస్పెండ్ చేశారు. 2023 అక్టోబరులో ఓ మహిళ స్టేషనుకు వచ్చి తన భర్త వేధింపులు భరించలేకపోతున్నానని ఫిర్యాదు చేసింది. సదరు భర్తపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఆ తర్వాత ఇన్‌స్పెక్టర్ ప్రేమ్‌కుమార్ తనతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని, వాట్సాప్ చాటింగ్, ఫోన్ రికార్డులతో వేధిస్తున్నాడని ఆ మహిళ సైబరాబాద్ కమిషనర్ మహంతికి ఫిర్యాదు చేసింది. దాంతో విచారణ చేపట్టిన అధికారులు అది నిజమేనని తేలడంతో ప్రేమ్‌కుమార్‌ను సస్పెండ్ చేస్తూ సీపీ ఉత్తర్వులు జారీ చేశారు. భూవివాద దందాలు, ఇతర కేసుల్లోనూ ప్రేమ్‌కుమార్‌పై పలు ఆరోపణలు ఉన్నట్లు అధికారుల విచారణలో బయటపడినట్లు సమాచారం.









