AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

టీఎస్ ఎప్‌సెట్‌ (ఎంసెట్) నోటిఫికేషన్ విడుదల

రాష్ట్రంలో టీఎస్ ఎప్‌సెట్‌(ఎంసెట్‌) నోటిఫికేష‌న్‌ను విడుద‌లైంది. ఈ మేరకు మంగళవారం తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఎప్‌సెట్-2024 (ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్)కు సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ నెల 6వ తేదీన ఎప్‌సెట్ తొలి స‌మావేశం తెలంగాణ ఉన్న‌త విద్యా కార్యాల‌యంలో జ‌ర‌గ‌నుంది. అయితే దరఖాస్తుల స్వీకరణ ఫిబ్రవరి 26న మొదలై.. ఏప్రిల్ 6న ముగుస్తుందని ఉన్నత విద్యా మండలి చైర్మన్ లింబాద్రి వెల్లడించారు. అదే విధంగా మే 9 -12వ తేదీల మధ్య పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ సంవత్సరం పరీక్షలను జేఎన్‌టీయూ హైదరాబాద్ యూనివర్సిటీ నిర్వహించనుందని ఆయన వివరించారు. దరఖాస్తులను ఆన్‌లైన్‌లో స్వీకరించనున్నట్టు తెలిపారు. కాగా మెడిసిన్ సీట్ల భర్తీ కోసం జాతీయ స్థాయిలో నీట్ పరీక్షను నిర్వహిస్తున్న నేపథ్యంలో ‘ఎం’ అక్షరాన్ని ఎంసెట్ నుంచి తొలగించారు. దీంతో ఎంసెట్ పేరు ‘ఎప్‌సెట్‌’గా మారిపోయిన విషయం తెలిసిందే. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీలో ప్రవేశాల కోసం మాత్రమే ఈ పరీక్షను నిర్వహించనున్నారు.

ANN TOP 10