AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఈనెల 13న నల్గొండలో బహిరంగ సభ: కేసీఆర్

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం కేసీఆర్ ఆధ్వర్యంలో కృష్ణా జలాల పరిరక్షణ సమీక్ష సమావేశానికి ఉమ్మడి మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు హాజరయ్యారు. ఎన్నికల తర్వాత కేసీఆర్ తెలంగాణ భవన్‌కు రావడంతో కార్యకర్తలు భారీగా తరలి వచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేసీఆర్ మాట్లాడుతూ.. ఎన్ని అడ్డంకులు సృష్టించినా నల్గొండలో ఈనెల 13న భారీ బహిరంగ సభ నిర్వహించి తీరుతామని అన్నారు. కృష్ణా ప్రాజెక్టుల కోసం పోరాటం చేయాలని ఆయన నిర్ణయించారు. బహిరంగ సభ నిర్వహించి.. ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ప్రకటించారు. కేఆర్ఎంబీ పరిధిలోకి ప్రాజెక్టులు వెళ్లితే రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వానికి అసలు తెలివి లేదని కేసీఆర్ విమర్శించారు. బీఆర్ఎస్‌కు పోరాటం కొత్త కాదన్నారు. ప్రభుత్వం అనాలోచిత వైఖరి కృష్ణ బేసిన్‌లోని దక్షిణ తెలంగాణ ప్రజలకు గొడ్డలి పెట్టని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అవగాహన రాహిత్యంతో ప్రాజెక్టుల కట్ట మీదకు కూడా పోలేమని చెప్పారు. రాష్ట్రానికి రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని చెప్పారు. ఇప్పుడు అవగాహన లేక దీని వల్ల నష్టాన్ని ప్రజలకు చెప్పాలని, నది జలాలపై తెలంగాణ హక్కుల కోసం ఎంత కాడికైనా పోరాడుతామని అన్నారు. కేఆర్ఎంబీకి సాగర్, శ్రీశైలం సహా కృష్ణా నది మీద ప్రాజెక్టులను అప్పజెప్పి కేంద్రం చేతికి మన జుట్టు అందించిందని, కాంగ్రెస్ ప్రభుత్వ తెలంగాణ వ్యవసాయ రైతాంగ వ్యతిరేఖ నిర్ణయాలను తీవ్రంగా ఖండిస్తూన్నామన్నారు. ప్రజా క్షేత్రంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రమాదకర ధోరణిని ఎండగడుతామన్నారు. సీఎంకు ప్రాజెక్టుల మీద అవగాహన లేదని, డ్యాంకు సున్నం వేయాలన్నా ఢిల్లీకి వెళ్లి పర్మిషన్ తీసుకోవాలని అన్నారు. తమ ప్రభుత్వం అండగా ఉన్నందును ప్రాజెక్టుల అప్పగింతకు ఒప్పుకోదని చెప్పారు. ఇప్పుడు అవగాహన లేకనే ప్రాజెక్టులను అప్పగించడానికి ఒప్పుకున్నారని కేసీఆర్ వ్యాఖ్యలు చేశారు.

ANN TOP 10