AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

పెద్దపల్లి ఎంపీ జంప్‌.. బీఆర్‌ఎస్‌కు బిగ్‌షాక్‌

కాంగ్రెస్‌లో చేరిన ఎంపీ వెంకటేశ్‌
ఢిల్లీలో సీఎం రేవంత్‌రెడ్డి, కేసీ వేణుగోపాల్‌ సమక్షంలో కండువ కప్పుకున్న నేత
ఆయన అనుచరులు సైతం హస్తం గూటికి..

అమ్మన్యూస్, న్యూఢిల్లీ: ఎన్నికల వేళ బీఆర్‌ఎస్‌ పార్టీకి బిగ్‌ షాక్‌ తగిలింది. పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్‌ మంగళవారం కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) కేసీ వేణుగోపాల్, సీఎం రేవంత్‌ రెడ్డి, కాంగ్రెస్‌ ముఖ్య నేతల సమక్షంలో వెంకటేశ్‌ కాంగ్రెస్‌ కండువ కప్పుకున్నారు. అంతకుముందు ఢిల్లీలోని రేవంత్‌ రెడ్డితో వెంకటేశ్‌ కలిసి ఆయన కారులో కేసీ వేణుగోపాల్‌ నివాసానికి వచ్చారు. అక్కడ డిప్యూటీ సీఎం మల్లు రవి, కాంగ్రెస్‌ ముఖ్య నేతలు ఉన్నారు. అందరి సమక్షంలో ఎంపీ కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనకు వేణుగోపాల్‌ కాంగ్రెస్‌ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. టీటీడీ బోర్డ్ మాజీ సభ్యుడు మన్నె జీవన్, మరికొంతమంది వెంకటేశ్‌ అనుచరులు కూడా కాంగ్రెస్‌లో చేరారు.

ANN TOP 10