AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

చిరంజీవి సరసన త్రిష మరోసారి…

మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) హీరోగా వశిష్ఠ (Vassishta) దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘విశ్వంభర’. యు.వి. క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోన్న ఈ చిత్రం షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రంలో చిరు సరసన కథానాయికగా నటించేది ఎవరని చాలాకాలంగా చర్చ నడుస్తోంది. ఓ పక్క త్రిష (Trisha) కథానాయిక అని నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఆమెతోపాటు అనుష్కశెట్టి పేరు కూడా వినిపించింది. అయితే ఫైనల్‌గా త్రిషను కథానాయికగా ఖరారు చేశారు. సోమవారం ఆమె సెట్‌లో అడుగుపెట్టింది. ఈ విషయాన్ని చిత్ర బృందం సోషల్‌ మీడియా వేదికగా తెలిపింది. త్రిషకు సెట్‌లోకి ఆహ్వానం పలుకుతూ చిరంజీవి ఓ ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం ఆయన చేసిన వార్త వైరల్‌ అవుతోంది.

చిరంజీవి, త్రిష కలిసి స్టాలిన్ (2006)చిత్రంలో నటించారు. దాదాపు 18 ఏళ్ల తర్వాత వీళ్లిద్దరూ కలిసి నటించనున్నారు. లయన్(2015), నాయకి చిత్రాల తర్వాత తెలుగు సినిమాకు కొంతగ్యాప్‌ ఇచ్చిన త్రిష ఏడేళ్ల తర్వాత ఈ చిత్రంతో టాలీవుడ్‌కి రీ ఎంట్రీ ఇస్తోంది. సోమవారం నుంచి చిరంజీవి, త్రిషపై కీలక సన్నివేశాల చిత్రీకరణ చేయనున్నారని సమాచారం. ఫాంటసీ కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని యు.వి.క్రియేషన్స్‌ పతాకంపై విక్రమ్‌, వంశీ, ప్రమోద్‌ నిర్మిస్తున్నారు.

ANN TOP 10