AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

పద్మవిభూషణుడికి సీఎం రేవంత్‌ అభినందనలు

పద్మవిభూషణ్‌ గ్రహీత మెగాస్టార్‌ చిరంజీవిని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అభినందించారు. దేశంలోనే అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌తో కేంద్ర ప్రభుత్వం గౌరవించిన విషయం తెలిసిందే. ఈ పురస్కారం మెగాస్టార్‌కి వచ్చిందని తెలిసి.. సినీ, రాజకీయ ప్రముఖులెందరో ఆయనని అభినందించారు. తన మామగారికి పద్మవిభూషణ్‌ పురస్కారం వరించిన సందర్భంగా మెగా కోడలు ఉపాసన.. తన నివాసంలో శనివారం రాత్రి అభినందన సభను నిర్వహించి గ్రాండ్‌ పార్టీ ఏర్పాటు చేశారు.


ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి చిరంజీవిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. చిరంజీవికి అవార్డు రావడం మనందరికీ గర్వకారణం, వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు అని సీఎం అన్నారు. ఈ సందర్భంగా చిరంజీవి మట్లాడుతూ నన్ను అభినందించిన ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు అని అన్నారు.

ANN TOP 10