AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

భగీరథ గుంతలను తిరిగి పూడ్చరేం?

బీజేపీ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి

ఆదిలాబాద్‌: భగీరథ పైపు లైను కోసం ఆదిలాబాద్‌ పట్టణంలో ఇష్టారాజ్యంగా గుంతలను తవ్వుతున్నారని, ఆ తరువాత తిరిగి పూడ్చడం లేదని బీజేపీ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. గురువారం పట్టణంలోని రాంనగర్‌ కాలనీలో మిషన్‌ భగీరథ పైప్‌ లైన్‌ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ పైప్‌ లైన్‌ కోసం తవ్విన గుంతలను తిరిగి పూడ్చక పోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులు సకాలంలో పూర్తికాకపోవడంతో ప్రజలు తాగునీటికి ఇబ్బంది పడుతున్నారన్నారు. గుంతలను తిరిగి పూడ్చకపోవడంతో రాత్రివేళ ప్రజలు ప్రమాదాల బారిన పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పనులు చేపట్టిన కాంట్రాక్టర్లకు బిల్లులు రాక పోడంతోనే అసంపూర్తిగా వదిలేస్తున్నారని అన్నారు. ఇంత జరుగుతున్నా ఎమ్మెల్యే జోగు రామన్న ఏ మాత్రం పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. ఎమ్మెల్యే నిర్లక్ష్యానికి ఇది ప్రత్యక్ష నిదర్శనమని అన్నారు.

ANN TOP 10