AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

భువనగిరి హాస్టల్‌లో ఇద్దరు టెన్త్‌ విద్యార్థినుల ఆత్మహత్య

భువనగిరి జిల్లా కేంద్రంలోని విషాదం చోటు చేసుకుంది. ఎస్సీ బాలికల సాంఘిక సంక్షేమ వసతీగృహంలో పదో తరగతి చదువుతున్న ఇద్దరు బాలికలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఒకే గదిలో వీరు ఉరివేసుకోవడం ఇప్పుడు సంచలనంగా మారింది.

పదో తరగతి చదువుతున్న భవ్య, వైష్ణవి అనే విద్యార్థినులు శనివారం రాత్రి భోజనం తర్వాత హాస్టల్‌ రూమ్‌లోకి వెళ్లారు. ఆ తర్వాత కాసేపటికే ఫ్యాన్‌కు ఉరివేసుకున్నారు. ఇది గమనించిన తోటి విద్యార్థినులు సిబ్బందికి సమాచారం అందించడంతో వెంటనే వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే ఇద్దరు బాలికలు మరణించారని వైద్యులు ధ్రువీకరించారు. మృతులు భవ్య, వైష్ణవి ఇద్దరిదీ హైదరాబాద్‌లోని హబ్సీగూడ అని పోలీసులు తెలిపారు. అయితే వారి ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. విద్యార్థినుల ఆత్మహత్య ఘటనపై జిల్లా ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి దర్యాప్తు చేస్తున్నారు.

ANN TOP 10