AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

నేడు తెలంగాణ కేబినెట్‌ సమావేశం

అధికారులు అందుబాటులో ఉండాలని సీఎస్‌ ఆదేశాలు
ఈ రోజు మధ్యాహ్నం 3.30 గంటలకు తెలంగాణ కేబినెట్‌ సమావేశం కానుంది. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ సచివాలయంలో మంత్రి మండలి సమావేశం జరగనుంది. సచివాలయంలోని ఆరో ఫ్లోర్‌ కేబినెట్‌ మీటింగ్‌ హాల్‌లో సమావేశం కానున్నారు. కేబినెట్‌ భేటీ సమయంలో అందరు స్పెషల్‌ సెక్రటరీలు, ప్రిన్సిపల్‌ సెక్రటరీలు, ప్రభుత్వ కార్యదర్శులు అందుబాటులో ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు.

రేవంత్‌ రెడ్డితో అహ్లువాలియా భేటీ
సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితో ప్రముఖ ఆర్థిక వేత్త, ప్రణాళికా సంఘం మాజీ ఉపాధ్యక్షుడు మాంటెక్‌ సింగ్‌ అహ్లువాలియా భేటీ అయ్యారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో కలిసి కేంద్ర, రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు, గడిచిన పదేళ్లలో భారీగా పెరిగిన అప్పులు, వాటి ప్రభావం, కాంగ్రెస్‌ హయాంలో దేశంలో అనుసరించిన ఆర్థిక సంస్కరణలు, వివిధ అంశాలపై ఈ సందర్భంగా చర్చించారు.

ANN TOP 10