AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

పంజాబ్ గవర్నర్ రాజీనామా

పంజాబ్‌ గవర్నర్‌ భన్వరీలాల్‌ పురోహిత్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయన గవర్నర్ పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ మేరకు శనివారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు తన రాజీనామాను పంపారు. ‘నా వ్యక్తిగత కారణాలు, కొన్ని ఇతర కట్టుబాట్ల కారణంగా నేను పంజాబ్ గవర్నర్, యూనియన్ టెరిటరీ, చండీగఢ్ పదవికి రాజీనామా చేస్తున్నాను. దయచేసి దానిని అంగీకరించండి తన రాజీనామా లేఖలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రాశారు. కేంద్ర పాలిత ప్రాంతమైన చండీగఢ్ అడ్మినిస్ట్రేటర్‌ బాధ్యతలకు సైతం ఆయన రాజీనామా చేశారు. భన్వరీలాల్ పురోహిత్ పంజాబ్ గవర్నర్‌గా 2021 ఆగస్టులో బాధ్యతలు స్వీకరించారు.

అయితే పంజాబ్‌లో పని చేసిన కాలంలో వివాదాలు తీవ్ర చర్చకు దారీ తీశాయి. భగవంత్ మాన్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఆయనకు, సీఎంకు మధ్య సంబంధాల్లో దిగజారాయి. పంజాబ్ అసెంబ్లీ సమావేశంలో విషయంలో ఇరువురి మధ్య వివాదం పెరిగాయి. ఆ వివాదాలు సుప్రీంకోర్టు వరకు చేరింది. వివిధ సమస్యలపై ప్రభుత్వాన్ని సమాధానం ఇవ్వాలని తరచూ డిమాండ్‌ చేస్తూ వచ్చారు. ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదించిన మూడు బిల్లులను ఆమోదించడానికి ఆయన నిరాకరించారు. దీనికి నిరసనగా సీఎం భగవంత్ మాన్ సహా ఆమ్ ఆద్మీ పార్టీ ఆయనపై విమర్శలు గుప్పించింది. ఆ వ్యాఖ్యలకు స్పందిస్తూ.. ఇది సక్రమం కాదని, చట్ట విరుద్ధమని మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడి ప్రభుత్వం పాలన కొనసాగిస్తుందని భన్వరీలాల్ పురోహిత్ అన్నారు.

ANN TOP 10