AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

4న తెలంగాణ కేబినెట్‌ భేటీ.. బడ్జెట్‌ సమావేశాలపై చర్చ!

ఈ నెల 4వ తేదీన తెలంగాణ కేబినెట్‌ సమావేశం కానుంది. రాష్ట్ర బడ్జెట్‌ సమావేశాల నిర్వహణతో పాటు కాంగ్రెస్‌ ప్రకటించిన ఆరు గ్యారంటీల్లోని రెండు స్కీమ్‌ల అమలుపై ఈ భేటీలో చర్చించనున్నారు. ఈ సమావేశంలోనే రాష్ట్ర బడ్జెట్‌ సమావేశాల నిర్వహణ తేదీని అధికారికంగా నిర్ణయించనున్నారు. ఈ నెల 8వ తేదీ నుంచి రాష్ట్ర బడ్జెట్‌ సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. 9వ తేదీన గవర్నర్‌ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం చేయనున్నారు.

ఇక 10వ తేదీన ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. 11వ తేదీ ఆదివారం సెలవుదినం వదిలేస్తే.. 12వ తేదీ నుంచి ఐదు రోజుల పాటు బడ్జెట్‌ సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.

ANN TOP 10