మంత్రి కేటీఆర్‌కు రేవంత్‌రెడ్డి సవాల్
మంత్రి కేటీఆర్‌కు బహిరంగ సవాల్ విసిరారు టి.కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి. విద్యుత్, సాగునీటి ప్రాజెక్టులపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు రేవంత్. టైమ్, డేట్‌ను మంత్రి కేటీఆర్ ఖరారు చేయాలని, ప్రజల మధ్య తేల్చుకుందామని ఛాలెంజ్ విసిరారు రేవంత్ రెడ్డి.
గురువారం నాడు మీడియాతో మాట్లాడిన రేవంత్.. టీవీ9 సాక్షిగా చర్చకు తాను సిద్ధం అని ప్రకటించారు. కేటీఆర్ ఎక్కడ చెబితే అక్కడ చర్చకు వచ్చేందుకు తాను సిద్ధం అన్నారు. ఇదే సమయంలో కవితపై ఈడీ విచారణపై షాకింగ్ కామెంట్స్ చేశారు రేవంత్. బీజేపీ, బీఆర్ఎస్ నాటకంలో పార్ట్ ఈడీ విచారణ అని విమర్శించారు రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్, బీజేపీది మిత్రబంధం అన్నారు. కవిత విషయంలో మీడియా హడావిడే ఎక్కువగా ఉందని, ఈ విషయం చాలా సాధారణ విషయం అని వ్యాఖ్యానించారు రేవంత్ రెడ్డి. లిక్కర్ స్కామ్ కేసులో కవిత విచారణను ఎదుర్కోవాల్సిందేనని అన్నారు.
సోనియా గాంధీని ఈడీ విచారించిన సమయంలో ఎమ్మెల్సీ కవిత, సీఎం కేసీఆర్ ఎందుకు మాట్లాడలేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. వాటాల పంపకంలో తేడా వల్లే చిల్లర పంచాయతీ వచ్చిందన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులపై తానుు చేసే ఆరోపణలకు ఆధారాలు ఉన్నాయని, ఆధారాలు లేకుండా తాను ఆరోపణలు చేయనని రేవంత్ రెడ్డి అన్నారు.