AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

‘ప్రజాభవన్‌’ దగ్గర కారు బీభత్సం కేసు.. పోలీసుల అదుపులోకి బోధన్‌ సీఐ ప్రేమ్‌ కుమార్‌

హైదరాబాద్‌‌ బేగంపేటలోని ప్రజాభవన్‌ దగ్గర కారుతో బీభత్సం కేసులో పోలీసు విచారణ కొనసాగుతోంది. బోధన్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కుమారుడు సాహిల్‌ ప్రమేయం ఉన్న ఈ కేసులో తాజాగా మరో ఇద్దరిని పంజాగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సాహిల్‌ను తప్పించేందుకు ప్రయత్నించిన బోధన్‌ ఇన్‌స్పెక్టర్‌ ప్రేమ్‌ కుమార్‌, షకీల్‌ అనుచరుడు అబ్దుల్‌ వాసేను అదుపులోకి తీసుకొచ్చారు. బోధన్‌లో అదుపులోకి తీసుకుని ఆదివారం ఉదయం హైదరాబాద్‌ తరలించారు. పంజాగుట్ట ఇన్‌స్పెక్టర్‌ దుర్గారావుతో బోధన్‌ సీఐ ప్రేమ్‌ కుమార్‌ మాట్లాడిన కాల్‌ రికార్డును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

కాగా డిసెంబర్ 23న అర్ధరాత్రి తర్వాత సాహిల్‌ అతివేగంతో కారు నడిపాడు. ప్రజాభవన్‌ ముందు ఉన్న ట్రాఫిక్‌ బారికేడ్లను కారుతో ఢీకొట్టాడు. అయితే తన డ్రైవర్ ఈ ప్రమాదానికి కారణమని చిత్రీకరించే ప్రయత్నం చేశారు. సాహిల్ స్థానంలో డ్రైవర్‌ను పెట్టి దుబాయ్‌ పరారైన విషయం తెలిసిందే. అయితే సాహిల్‌ను తప్పించేందుకు ప్రయత్నాలు జరిగాయి.

ANN TOP 10