AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బరితెగించిన ప్రేమజంట‌.. కారులో న‌గ్నంగా రొమాన్స్.. ఆ త‌ర్వాత ఏం జ‌రిగిందంటే..?

బెంగ‌ళూరు : వారిద్ద‌రు ప్రేమికులు. ముద్దులు మునిగి తేలాల‌నుకున్నారు.. కౌగిలింత‌ల్లో ఒదిగి పోవాల‌నుకున్నారు. ఇంకేముంది.. కారులోనే శృంగార చ‌ర్య‌కు తెర‌లేపారు. ఓ పార్కు స‌మీపంలో కారును ఆపిన ఆ ప్రేమికులు న‌గ్నంగా మారిపోయారు. ముద్దులు, కౌగిలింత‌ల‌తో రొమాన్స్‌లో మునిగిపోయారు. అయితే కారులో ఉన్న ఆ జంట‌ను స‌బ్ ఇన్‌స్పెక్ట‌ర్ గ‌మ‌నించి, ద‌గ్గ‌రికి వెళ్లారు. తీవ్ర ఆందోళ‌న‌కు గురైన ఆ జంట ఎస్ఐపై నుంచి కారును వేగంగా పోనిచ్చారు. ఈ ఘ‌ట‌న క‌ర్ణాట‌క రాజ‌ధాని బెంగ‌ళూరులోని జ‌న‌భార‌తి పోలీసు స్టేష‌న్ ప‌రిధిలో గురువారం చోటు చేసుకుంది.

తీవ్ర గాయాల‌పాలైన ఎస్ఐ మ‌హేశ్ ఓ ప్ర‌యివేటు ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే మ‌హేశ్ జ‌న‌భార‌తి పోలీసు స్టేష‌న్‌లో ఎస్ఐగా విధులు నిర్వ‌ర్తిస్తున్నారు. ఆ ప్రేమ జంట అశ్లీల చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతున్న‌ట్లు తెలియ‌డంతో, వారిని హెచ్చ‌రించేందుకు ఎస్ఐ వెళ్లారు. ఈ ప్రాంతం నుంచి వెళ్లిపోవాల‌ని సూచించేందుకు వెళ్ల‌గా, ఎస్ఐపై నుంచి కారును పోనిచ్చారు.

ఇక స్థానికులు ఆ కారు రిజిస్ట్రేష‌న్ నంబ‌ర్‌ను న‌మోదు చేసుకున్నారు. ఈ ఘ‌ట‌న‌పై జ‌న‌భార‌తి పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ఆ ప్రేమ జంట‌ను గుర్తించి, క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని పోలీసులు స్ప‌ష్టం చేశారు.

ANN TOP 10