AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

అవినీతి తిమింగలం శివబాలకృష్ణకు 14 రోజుల రిమాండ్

హైదరాబాద్: అక్రమాస్తుల కేసులో అరెస్టైన హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది నాంపల్లి ఏసీబీ కోర్టు. ఆదాయానికి మించిన ఆస్తులున్నాయన్న ఆరోపణలతో శివబాలకృష్ణ ఇంటితోపాటు 16 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులు భారీగా నగదు, బంగారు ఆభరణాలు, విలువైన వస్తువులు సీజ్ చేశారు. అనంతరం బాలకృష్ణను బుధవారం అరెస్ట్ చేసిన అధికారులు గురువారం నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరుపర్చారు. కోర్టు రిమాండ్ విధించిన నేపథ్యంలో శివబాలకృష్ణను చంచల్‌గూడ జైలుకు తరలించనున్నారు. కాగా, బుధవారం, గురువారం ఉదయం శివబాలకృష్ణ నివాసంతోపాటు ఆయన బంధువులు, సహచరుల ఇళ్లల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. రూ. 99.60 లక్షల నగదు, 1988 గ్రాముల బంగారం, 6 కేజీల వెండిని సీజ్ చేశారు ఏసీబీ అధికారులు. దాదాపు 8.26 కోట్ల విలువైన ఆస్తుల పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఖరీదైన కార్లు, ఐఫోన్లు, వందకుపైగా ఖరీదైన చేతి గడియారాలు సీజ్ చేశారు.

ANN TOP 10