గుండెల్లో పెట్టి చూసుకుంటానని స్పష్టం
యువజన కాంగ్రెస్ నాయకులకు నియామక పత్రాలు అందజేత
ఆదిలాబాద్ ప్రతినిధి : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు కృషి చేసిన ప్రతి ఒక్క కార్యకర్తను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటానని ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి కంది.శ్రీనివాస రెడ్డి అన్నారు. పట్టణంలోని ప్రజా సేవాభవన్ లో జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు సాయి చరణ్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. జిల్లా యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు గా నియమితులైన వేముల నాగ రాజు, యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి గా నియమింపబడిన నిమ్మల గౌతమ్ రెడ్డి కి కంది శ్రీనివాస రెడ్డి నియామక పత్రాలను అందజేశారు ఈ సందర్భంగా ఆయన కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ బూత్ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్న ప్రతి ఒక్క కార్యకర్తకు తప్పకుండా రాబోయే రోజుల్లో
జిల్లా స్థాయి నామినేటెడ్ పదవులతో పాటుగా, పార్టీ పదవుల్లో కూడా సముచిత స్థానం కల్పిస్తామన్నారు.
మన ప్రియతమ నేత రాహుల్ గాంధీ ని ప్రధాన మంత్రిని చేసేందుకు ప్రతి ఒక్కరు కంకణ బద్ధులై పని చేయాల్సిన అవసరముందన్నారు. ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానాన్ని గెలిపించి రాహుల్ గాంధీ గారి బహుమతిగా ఇద్దామని సూచించారు. జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు సాయి చరణ్ గౌడ్ మాట్లాడుతూ ప్రతి యువకుడు రాబోయే రోజుల్లో రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని
దేశ భవిష్యత్తు యువకుల చేతుల్లో ఉందని తెలిపారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసే యువకులను గుర్తించి కాంగ్రెస్ అధిష్టానం తగిన రీతిలో పదవులను కట్టబెడుతుందన్నారు. ఈ కార్యక్రమంలోడీసీసీబీ చైర్మన్అ డ్డి భోజా రెడ్డి,జిల్లా కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు భూపెళ్లి శ్రీధర్,రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి,మావల మండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కుదురుపాక సురేష్ ఆదిలాబాద్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి సామ రూపేష్ రెడ్డి,మాజీ NSUI జిల్లా అధ్యక్షుడు బండి నర్సింహా చారి,యువజన కాంగ్రెస్ నాయకులు నాయిడి ప్రకాష్
తదితరులు పాల్గొన్నారు









