AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

సాయి పల్లవి ఇంట నిశ్చితార్థం.. సందడి మామూలుగా లేదుగా..!

తెలుగు ప్రేక్షకుల్లో సాయి పల్లవికి(Sai pallavi) ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ క్రేజ్‌తో ఆమెకు లేడీ పవర్‌స్టార్‌ (lady power star) అనే బిరుదు కూడా ఇచ్చారు. సాయి పల్లవి డాన్స్ క్వీన్ అనే విషయం తెలిసిందే! ఆమెకు స్పీడ్‌కి తగ్గ డాన్స్ నంబర్‌ పడితే ఫ్లోర్‌ దద్దరిల్లిపోవాల్సిందే! తాజాగా ఆమె డాన్స్ వీడియో ఒకటి నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. తన సోదరి పూజా కన్నన్ నిశ్చితార్థం వినీత్ తో జరిగింది. ఈ వేడుకలో సాయి పల్లవి చేసిన సందడి అంతా ఇంతా కాదు. నిశ్చితార్థం అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి ఓ పాటకు తీన్మా ర్‌ డాన్స్ చేసింది. ఈ పాట సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. సాయి పల్లవి సోదరి పూజా తన చిరకాల మిత్రుడితో కొంతకాలంగా ప్రేమలో ఉంది. ఇరువైపు కుటుంబాలు అంగీకరించగా వారిద్దరు త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నారు. ఈ విషయాన్ని పూజా సోషల్‌ మీడియా వేదికగా తెలిపింది.

‘నిస్వార్థంగా ప్రేమించడం అంటే ఏమిటో ఈ అందమైన అబ్బాయి నాకు నేర్పించాడు. ప్రేమలో సహనం, దృడత్వం, ఉనికిని ఎలా అందంగా ఉంచుకోవాలో నేర్పించారు. ఇతను వినీత్‌.. నా సన్‌ షైన్‌. మొన్నటి వరకు నా క్రైం పార్ట్‌నర్‌. ఇప్పుడు నా లైఫ్‌ పార్ట్‌నర్‌ కాబోతున్నాడు. ఐ లవ్‌ యూ మై పార్టనర్‌’’ అంటూ తన ప్రేమికుడిని పరిచయం చేసింది. అయితే వీరి పెళ్లి ఎప్పుడు? ఏమిటి? అనేది తెలియాల్సి ఉంది. పూజా కూడా ఓ చిత్రంలో నటించింది. తదుపరి ఆమె సినిమాల వైపు దృష్టి సారించలేదు.

ANN TOP 10