కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మహాలక్ష్మి పథకం ద్వారా బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తోంది. అయితే నిన్న మొన్నటి వరకూ విపరీతంగా ఈ సదుపాయాన్ని వినియోగించుకున్న మహిళలు సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేశారు. గతంలో కొట్టుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. అలా వార్తల్లో నిలిచిన టీఎస్ఆర్టీసీ ఇప్పుడు ఒక మహిళ చేసిన పనితో మరోసారి చర్చనీయాంశమైంది. బస్సులో ఉచితంగా ప్రయాణిస్తున్న ఇద్దరు మహిళలు ఊరికే ఎందుకు కూర్చోవాలనుకున్నారో ఏమో.. బస్సులో ప్రయాణిస్తూ బీడీలు చుడుతూ కనిపించారు. ఆ సంఘటనను వీడియో తీసిన యువకుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది కాస్తా వైరల్ గా మరింది. దీంతో నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది ఈ వీడియో. ఈ ఘటన ఏ డిపో పరిధిలో చోటు చేసుకుందో ఇంకా తెలియలేదు.
ఈ వైరల్ వీడియోపై పలువురు సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్ గా ఉండే వారు స్పందిస్తున్నారు. తమ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో ట్వీట్ చేస్తున్నారు. ‘ఆడుతూపడుతూ పనిచేస్తుంటే అలుపు సోలుపేముంది అంటూ ఒకరు కామెంట్ చేస్తే.. ఉచిత బస్సులో బీడీలు చూడుతే మస్తు గమ్మత్తుగా ఉంది’ అంటూ మరికొందరు ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు. ఇక ఈ వీడియో పోస్ట్ చేసిన వ్యక్తిని కొంతమంది విమర్శిస్తున్నారు. ఇలా ఈ వీడియో పై నెటిజన్లు నుంచి వివిధ రకాల కామెంట్లు వస్తున్నాయి.









