AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కాసేపట్లో కాంగ్రెస్ కేంద్ర మేనిఫెస్టో కమిటీ భేటి

గాంధీ భవన్‌లో నేడు మధ్యాహ్నం కేంద్ర మేనిఫెస్టో కమిటీ భేటీ కానుంది. ఆల్ ఇండియా ప్రొఫెషనల్ కాంగ్రెస్ కమిటీ చైర్మన్ ప్రవీణ్ చక్రవర్తి ఆధ్వర్యంలో సమావేశం జరగనుంది. అన్ని రాష్ట్రాల్లో తిరిగి కేంద్ర మేనిఫెస్టో కమిటీ అభిప్రాయాలను సేకరిస్తోంది. నేడు తెలంగాణ నుంచి మేనిఫెస్టో కమిటి అభిప్రాయాల సేకరణ జరపనుంది. తెలంగాణ మేనిఫెస్టోపై జాతీయ కాంగ్రెస్ నాయకుల్లో పాజిటివ్ టాక్ నడుస్తోంది. దేశవ్యాప్తంగా ఇదే విధానాన్ని ప్రచారం చేయాలని ప్రపోజల్ పెట్టడం జరిగింది. నాలుగైదు కామన్ స్కీములతో పాటు, రాష్ట్రాల కోసం ప్రత్యేక అంశాలను మేనిఫెస్టోలో పెట్టాలని కాంగ్రెస్ నిర్ణయించింది.

ANN TOP 10