AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మాదాపూర్‌ పోలీస్‌స్టేషన్‌లో పేలిన సిలిండర్లు..

హైదరాబాద్‌ నగర పరిధిలోని మాదాపూర్‌ పోలీస్‌స్టేషన్‌లో సోమవారం రాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. సీజ్‌ చేసిన సిలిండర్లు పేలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బాణాసంచా నుంచి నిప్పురవ్వలు రావడంతో మంటలు చెలరేగినట్లు తెలుస్తున్నది. పీఎస్‌ వద్ద ఉన్న సీజ్‌ సిలిండర్లపై బాణాసంచా నిప్పులు పడ్డాయి. దీంతో ఒక్కసారిగా సిలిండర్లలు పేలాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.

ANN TOP 10