AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ప్రధాని మోదీ నాకు చాలాకాలంగా తెలుసు.. ఆయన గొప్ప తపస్వి: ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్

ప్రధాని నరేంద్రమోదీ చాలాకాలంగా తనకు తెలుసునని… ఆయన గొప్ప తపస్వి అని ఆరెస్సెస్ సర్‌సంఘ్‌చాలక్ (ఆరెస్సెస్ చీఫ్) మోహన్ భగవత్ అన్నారు. అయోధ్య బాలరాముడి విగ్రహం ప్రాణప్రతిష్ఠ అనంతరం ఆయన మాట్లాడుతూ… ప్రాణప్రతిష్ఠకు ముందు ప్రధాని కఠినమైన ఉపవాసదీక్ష చేపట్టారని గుర్తు చేశారు. ప్రధాని ఒక తపస్వి.. కానీ ఆయన ఒక్కరే చేయలేరు.. మనం కూడా మనవంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

అయోధ్యలో రామ్ లల్లాతో భారత్ ప్రతిష్ఠ తిరిగి వచ్చినట్లయిందన్నారు. ప్రపంచానికి మార్గదర్శనం చేసే నయా భారత్ కచ్చితంగా ఉద్భవిస్తోందన్నారు. రాముడి కోసం కోట్లాది గళాలు స్మరించాయన్నారు. రాముడు ధర్మం, త్యాగనిరతికి ప్రతీక అన్నారు. అందరినీ సమన్వయం చేసుకొని ముందుకు వెళ్లడమే మన ధర్మం అన్నారు. పేదల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందని వెల్లడించారు.

ANN TOP 10