AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

‘వ్యూహం’ సెన్సార్ సర్టిఫికెట్ ను క్వాష్ చేసిన హైకోర్టు

ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందిన ‘వ్యూహం’ సినిమాకు మరోసారి తెలంగాణ హైకోర్టు బ్రేక్ వేసింది. సెన్సార్ బోర్డు గతంలో ఇచ్చిన సెన్సార్ సర్టిఫికెట్ ను క్వాష్ చేసింది. మూడు వారాల్లో మరోసారి సినిమాను పరిశీలించి సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వాలని సెన్సార్ బోర్డును ఆదేశించింది. మరోవైపు, ఎగ్జామింగ్ కమిటీ ఇచ్చిన సవరణలను రివ్యూ కమిటీ పట్టించుకోకపోవడంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోసారి రెండు కమిటీలు సినిమా చూసి తమకు నివేదిక అందజేయాలని ఆదేశించింది.

ఈ చిత్రం టీడీపీ అధినేత చంద్రబాబును కించపరిచేలా ఉందంటూ ఆ పార్టీ యువనేత నారా లోకేశ్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు సినిమాను విడుదల చేవద్దని గతంలోనే ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడు ఏకంగా సెన్సార్ సర్టిఫికెట్ ను క్వాష్ చేసింది.

ANN TOP 10