ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణ గడువు సోమవారంతో ముగియనుంది. ఈరోజు సాయంత్రం 3 గంటలకు నామినేషన్ ఉపసంహరణ గడువు ముగియనుంది. అయితే రెండు ఎమ్మెల్సీ స్ధానాలకు రెండు నామినేషన్లు మాత్రమే రావడంతో ఎన్నికలు లేకుండానే నామినేషన్ వేసిన ఇద్దరు అభ్యర్థులను ఎమ్మెల్సీలుగా అసెంబ్లీ కార్యాలయం ప్రకటించనుంది. ఇవాళ సాయంత్రం మూడు గంటల తర్వాత మహేష్ కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్‌లను ఎమ్మెల్సీలుగా అసెంబ్లీ కార్యాలయం ప్రకటించనుంది.









