AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో టీడీపీ సభ్యుల సస్పెన్షన్‌

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం ప్రవేశపెట్టారు. దీనిపై చర్చ సందర్భంగా.. గందరగోళ పరిస్థితి ఏర్పడింది. గవర్నర్‌ ప్రసంగాన్ని కొందరు హేళనగా మాట్లాడుతున్నారని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్‌ ప్రసంగంపై దుష్ప్రచారం చేస్తున్నారని.. గవర్నర్‌కు సీఎం స్వాగతం పలకలేదని Telugu Desam Party తప్పుడు ప్రచారంపై వీడియోలతో సహా వాస్తవాలను మంత్రి బయటపెట్టారు.

గవర్నర్‌ను కించపరిస్తే సహించాలా?.. దీన్ని చాలా సీరియస్‌గా తీసుకుంటామని AP speaker తమ్మినేని సీతారాం వ్యాఖ్యానించారు. ప్రివిలేజ్‌ కమిటీ ముందు వీడియో ప్రదర్శిస్తామన్నారు. దీనిపై కఠిన చర్యలు ఉంటాయని స్పీకర్‌ స్పష్టం చేశారు. అసెంబ్లీ నుంచి 12 మంది టీడీపీ సభ్యులను సస్పెండ్‌ చేశారు. పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని ఈ సెషన్ ముగిసేవరకు.. మిగతా సభ్యులను ఒక్కరోజు సస్పెండ్ చేస్తూ.. సభాపతి నిర్ణయం తీసుకున్నారు.

ANN TOP 10