AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కేటీఆర్‍ మతిస్థిమితం కోల్పోయారు.. కూనంనేని సంచలన వ్యాఖ్యలు..!

మాజీ మంత్రి కేటీఆర్ పై సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారం కోల్పోవడంతో మాజీ మంత్రి కేటీఆర్ మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ నిరంకుశ విధానాలు ఇంకా ఉన్నాయన్నారు.
విద్యుత్ బిల్లులు కట్టొద్దని కేటీఆర్ అనడం ప్రజాస్వామ్యమా అని నిలదీశారు. ప్రజలు ఇచ్చిన తీర్పును బీఆర్ఎస్ నేతలు అవమానిస్తున్నారని చెప్పారు.

గ్యారంటీలు వందరోజుల్లో అమలు చేయడం అంటే చట్టబద్దత రావడమేనని పేర్కొన్నారు. కొంచెం ఆలస్యం అయినా కాంగ్రెస్ గ్యారెంటీలు అమలు చేస్తుందని చెప్పారు. వంద రోజులు కూడా కాకముందే కేటీఆర్ విమర్శలు చేయడం ఆయన అహంకారానికి నిదర్శనమని విమర్శించారు. తాము తప్పితే ఎవరికీ పరిపాలన చేసే హక్కులేదన్నట్టుగా బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్, బీజేపీ ఒక్కటేనన్న కేటీఆర్ వ్యాఖ్యలను కూనంనేని స్పందించారు. కాంగ్రెస్, బీజేపీ ఎప్పుడూ ఒక్కటి కాలేవని చెప్పారు. బీఆర్ఎస్, బీజేపీకి మద్దతిస్తోందని ఆరోపించారు. ఎప్పటికైనా ఆ రెండు పార్టీలు ఒక్కటేని పేర్కొన్నారు. కాంగ్రెస్ తో ఎంఐఎం కలిస్తే తమకేం అభ్యంతరం కూనంనేని స్పష్టం చేశారు. కాళేశ్వరం అవినీతి నుంచి బయటపడేందుకే బీఆర్ఎస్ నేతలు ఇలా విమర్శలు చేస్తున్నారని అన్నారు.

ANN TOP 10