AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కోలుకుంటున్న కేసీఆర్‌.. చేతికర్రతో నడుస్తున్న వీడియో వైరల్‌

తుంటి ఆపరేషన్‌ తర్వాత బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ క్రమంగా కోలుకుంటున్నారు. గత ఆరు వారాలుగా వైద్యులు సూచించిన వ్యాయామం చేయడంతో పాటు తగినంత విశ్రాంతి తీసుకుంటూ క్రమంగా సాధారణ స్థితికి చేరుకుంటున్నారు. తాజాగా వైద్యుల పర్యవేక్షణలో చేతికర్ర సాయంతో కేసీఆర్‌ నడవడం ప్రారంభించారు. మరికొద్దిరోజుల్లోనే పూర్తిస్థాయిలో కోలుకుని తిరిగి సాధారణ స్థితిలో నడుస్తారని వైద్యులు తెలిపారు.

వైద్యుల పర్యవేక్షణలో చేతికర్ర సాయంతో కేసీఆర్ నడుస్తున్న వీడియోను రాజ్యసభ సభ్యులు సంతోశ్‌కుమార్‌ ట్విట్టర్‌(ఎక్స్‌)లో పోస్టు చేశారు. త్వరలోనే పూర్తిస్థాయిలో తనంతట తాను నడుస్తారని పేర్కొన్నారు.

ANN TOP 10