AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంకు గుండెపోటు.. హైదరాబాద్‌కు తరలింపు

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం (70) కు మంగళవారం గుండెపోటు వచ్చింది. తన స్వగ్రామమైన ఖమ్మం జిల్లాలోని తెల్ధారపల్లిలో ఉన్న సమయంలో తమ్మినేని శ్వాస తీసుకోవటానికి తీవ్ర ఇబ్బంది పడ్డారు. దీంతో.. కుటుంబసభ్యులు ఆయనను హుటాహుటిన అక్కడే ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆయనకు ప్రాథమిక చికిత్స అందించిన వైద్యులు.. లంగ్స్‌ ఇన్ఫ్‌క్షన్‌తో పాటు మైల్డ్‌ హార్ట్‌ స్ట్రోక్‌ లక్షణాలను గుర్తించారు. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తీసుకెళ్లాలని సూచించారు. దీంతో.. ఆయనను ఉన్నపళంగా హైదరాబాద్‌కు తరలించారు.

ఇదిలా ఉండగా.. గతంలోనూ తమ్మినేనికి స్ట్రోక్‌ వచ్చింది. కాగా.. అప్పుడు ఆయనకు వైద్యులు స్టంట్‌ వేశారు. ఇప్పుడు మరోసారి మైల్డ్‌ స్ట్రోక్‌ రావడంతో కుటుంబ సభ్యులు కొంత ఆందోళన చెందుతున్నారు. అయితే.. ఆయన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని.. ఆందోళన చెందాల్సిన పని లేదని వైద్యులు సూచించినట్టు తెలుస్తోంది.
పిల్లలకి వారి హద్దులు గురించి ఇలా చెప్పండి

సీపీఎం రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న తమ్మినేని వీరభద్రం ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో.. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అయితే.. తమ్మినేనికి కేవలం 5308 ఓట్లు మాత్రమే రావటం గమనార్హం. దీంతో.. ఆయన మూడో స్థానంలో నిలిచారు. పాలేరులో ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి 57,231 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచిన విషయం తెలిసిందే.

ANN TOP 10