AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మంత్రి దామోదర రాజనర్సింహనూ వదలని కేటుగాళ్లు.. ఏం చేశారంటే?

సోషల్ మీడియాలో సెలబ్రిటీల అకౌంట్స్‌ను హ్యాక్ చేయడం కేటుగాళ్లకు పరిపాటిగా మారిపోయింది. ఇటీవల పోలీస్‌శాఖ ఫేస్‌బుక్ పేజ్ హ్యాక్ అవడం సంచలనంగా మారగా.. ఇప్పుడు తాజాగా ఓ మంత్రి ఫేస్‌బుక్ పేజ్‌నే హ్యాక్ చేశారు కేటుగాళ్లు. వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఫేస్ బుక్ పేజ్ హ్యాక్‌కు గురైంది. దామోదర ఫేస్ బుక్ పేజీ నుంచి కొందరు కేటుగాళ్లు రకరకాల పోస్టులు పెట్టడంతో ప్రజలు షాక్ అయ్యారు. బీజేపీ, టీడీపీ, తమిళనాడులోని రాజకీయ పార్టీలకు చెందిన పోస్టులను కేటుగాళ్ళు వందల సంఖ్యలో మంత్రి ఫేస్‌బుక్ పేజ్‌లో పోస్ట్ చేశారు.

అయితే విషయం తెలిసి షాక్‌కు గురైన మంత్రి.. ఈ విషయాన్ని అధికారులకు తెలియజేశారు. తన ఫేస్‌బుక్ హ్యాక్‌ అయినట్లు అధికారులకు తెలిపారు. ఈ విషయంపై మంత్రి అనుచరులు.. కార్యకర్తలకు ఈ మేరకు సందేశం పంపించారు. మంత్రి దామోదర ఫేస్ బుక్ అకౌంట్ నుంచి వచ్చే మెసేజ్‌లకు స్పందించవద్దని కార్యకర్తలకకు ఆయన అనుచరులు మనవి చేశారు.

ANN TOP 10