నిజామాబాద్ లో సినీ ఫక్కీలో చోరీ జరిగింది. ప్రైవేట్ బస్సు లో నుంచి రూ.13 లక్షలను దుండగులు ఎత్తుకెళ్లారు. సారాంగాపుర్ డైరీ ఫాం వద్ద టీ కోసం బస్సును ఆపినప్పుడు ఈ ఘటన జరిగింది. పార్కింగ్ చేసిన బస్సు లో నగదు చోరీకి గురైంది. ముంబయి నుంచి జగిత్యాల వెళ్తుండగా నిజామాబాద్ నగర శివారులో ఈ ఘటన జరిగింది. బస్సు లో సీసీ కెమెరా కు చేయి అడ్డుపెట్టి మరీ చోరికి పాల్పడ్డారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. బస్సును క్షుణ్నంగా పరిశీలించారు. కేసు నమోదు చేసుకున్నారు. బస్సులో ప్రయాణించే వ్యక్తులు చోరీ చేశారా..? లేక బయటి నుంచి ఎవరైనా వచ్చి చోరీ చేశారా అనే కోణం లో పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు.









