AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

పండగ వేళ ఇల్లంతా కుక్కలతో సందడి.. భోగి పళ్లు పోసి విచిత్ర సంబురాలు

మానవ సంబంధాలు మంట గలుస్తున్న ఈ రోజుల్లో జంతువుల పై అపురూప ఆప్యాయతను కనబరుస్తోంది ఓ కుటుంబం. వందలాది శునకాల మద్య సంక్రాంతి సంబరాలు జరుపుకున్నారు. పెంపుడు కుక్కలకు బోగి పండ్లు పోసి ముచ్చట తీర్చుకున్నారు. పండుగ వేళ ఇల్లంతా శునకాలతో సందడే. ఈ విచిత్ర సంక్రాంతి సంబరాలు మహబూబాబాద్ జిల్లా ఈదులపూసపల్లి గ్రామంలో జరిగాయి.. పింగళి దీపిక కుటుంబం జంతు ప్రేమికుల కుటుంబం.. వీరు తమ ఇంట్లో సుమారు 20కి పైగా శునకాలను పెంచుకుంటున్నారు.

సహజంగా సంక్రాంతి భోగి నాడు తమ పిల్లలు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ బోగి పండ్లను పోసి దీవిస్తారు.. కానీ ఈ కుటుంబం పిల్లలతో పాటు పెంపుడు జంతువులు, వీధి కుక్కలకు కూడా బోగి పండ్లు పోసి ఆశీర్వదించారు. సంక్రాంతి బోగి వేడుకల్లో భాగంగా శునకాల పిల్లలకు సంప్రదాయంగా బంతి పూల రెక్కలు, చిల్లర నాణేలను, రేగుపండ్లు బోగి పండ్లు శునకాలపై పోసి ముచ్చెట తీర్చుకున్నారు.

ANN TOP 10