తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మణిపూర్‌కు బయలుదేరి వెళ్లారు. ఇప్పటికే ఆయన దేశ రాజధానిలో ఉన్నారు. ఈ ఉదయం ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఇంఫాల్‌కు బయలుదేరి వెళ్లారు. సార్వత్రిక ఎన్నికల యుద్ధానికి ప్రతిపక్ష పార్టీల ఉమ్మడి కూటమి ఇండియా సమాయాత్తమౌతోంది. అధికారంలో ఉన్న బీజేపీని ఓడించడానికి సర్వశక్తులనూ ఒడ్డుతోంది. దేశవ్యాప్తంగా ఎన్డీఏ వ్యతిరేక ఓటుబ్యాంకును కూడగట్టే ప్రయత్నాల్లో ఉంది. ఈ క్రమంలో కూటమి ప్రధాన భాగస్వామిగా ఉంటోన్న కాంగ్రెస్ పార్టీ.. జనంలోకి వెళ్తోంది.
ఇందులో భాగంగా- మలి విడత భారత్ జోడో యాత్రను చేపట్టింది. భారత్ జోడో న్యాయ్ యాత్ర పేరుతో ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ మరోసారి పాదయాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో దీన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. క్రికెట్‌కు ఐపీఎల్ స్టార్ గుడ్‌బై మణిపూర్ రాజధాని ఇంఫాల్‌లో నేడు ఆరంభం కానున్న ఈ పాదయాత్ర.. ముంబైలో ముగుస్తుంది. మణిపూర్, నాగాలాండ్, అస్సాం, అరణాచల్ ప్రదేశ్, మేఘాలయా, పశ్చిమ బెంగాల్, బిహార్, జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ మీదుగా ముంబైకి చేరుకుంటుంది. 15 రాష్ట్రాల్లో 66 రోజుల పాటు కొనసాగుతుంది.
ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలందరూ మణిపూర్‌కు బయలుదేరి వెళ్తోన్నారు. ఏఐసీసీ అధినేత మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శులు ప్రియాంక గాంధీ వాద్రా, కేసీ వేణుగోపాల్, జైరామ్ రమేష్, దీపా దాస్‌మున్షీ, ముకుల్ వాస్నిక్, రణ్‌దీప్ సింగ్ సుర్జేవాలా..మణిపూర్‌కు చేరుకున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మణిపూర్‌కు బయలుదేరి వెళ్లారు. ఇప్పటికే ఆయన దేశ రాజధానిలో ఉన్నారు. ఈ ఉదయం ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఇంఫాల్‌కు బయలుదేరి వెళ్లారు. బీజేపీ పాలనలో దేశంలోని అన్ని వ్యవస్థలు ధ్వంసం అయ్యాయని, వాటన్నింటినీ నిలబెట్టడం, సమ న్యాయాన్ని అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టామని అన్నారు.









