AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

సంక్రాంతి పండుగపూట విషాదం.. గాలిపటం ఎగరేస్తూ బాలుడి మృతి

సంక్రాంతి పండుగవేళ రాజేంద్రనగర్‌లో (Rajendrnagar) విషాదం చోటచేసుకున్నది. రాజేంద్రనగర్‌ పరిధిలోని అత్తాపూర్‌లో (Attapur) ఓ ఇంటిపై పతంగి ఎగురవేస్తున్న బాలుడు విద్యుధాఘాతంతో మృతిచెందాడు. అత్తాపూర్‌ లక్ష్మీవాణి టవర్స్‌పై పిల్లలు పతంగులు ఎగురవేస్తున్నారు. వారితోపాటు మహారాష్ట్రకు చెందిన 11 ఏండ్ల తనిష్క్‌ గాలిపటం ఎగురవేస్తుండగా విద్యుత్‌ తీగలు తగిలి అక్కడికక్కడే మరణించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

ANN TOP 10