హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందర్ రాజన్(Governor Tamilisai) సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. ఇవాళ ఆమె హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో భోగి వేడుకల్ని నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఆమె కుండలో పాయసం వండారు. దేశ, తెలంగాణ ప్రజలకు గవర్నర్ తమిళసై సంక్రాంతి, భోగి శుభాకాంక్షలు తెలిపారు. తనకు ఇది వ్యక్తిగతంగా ప్రత్యేకమైన పొంగల్ అని పేర్కొన్నారు. ఎందుకంటే చిరకాల స్వప్నం రామ మందిర నిర్మాణం పూర్తి అయినట్లు చెప్పారు. శ్రీరాముడిపై హిందీతో పాటు తెలుగు భాషలో ఓ పాటను రిలీజ్ చేయనున్నట్లు ఆమె తెలిపారు. ఈ ఏడాది కూడా సౌభాగ్యంతో వర్ధిల్లాలని, ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని ఆమె ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఇది వికసిత భారత్ అని ఆమె పేర్కొన్నారు. గవర్నర్ తమిళసై శుక్రవారం పుదుచ్చరి రాజ్‌నివాస్‌లో పొంగల్ వేడుకల్ని నిర్వహించారు.
ఈ రోజు సాయంత్రం గవర్నర్ తమిళసై సౌందర్ రాజన్ ఢిల్లీకి వెళ్తున్నారు. రేపు ప్రధానమంత్రి మోదీ, హోమ్ మినిస్టర్ అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ లతో అపాయింట్మెంట్లు ఖరారయ్యాయి.