AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

చాక్లెట్‌ కవర్లలో 6 కోట్ల విలువైన డైమండ్స్‌.. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో పట్టివేత

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో అక్రమంగా తరలిస్తున్న డైమండ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. దుబాయికి వెళ్తున్న ఇద్దరు ప్రయాణికుల నుంచి రూ.6కోట్ల విలువైన వజ్రాలు, రాళ్లు, విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నట్లు డీఆర్‌ఐ అధికారులు వెల్లడించారు.

హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు దుబాయికి వెళ్లేందుకు శుక్రవారం శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టుకు వచ్చారు. అయితే వారి ప్రవర్తన అనమానస్పదంగా ఉండటంతో డీఆర్‌ఐ అధికారులు అదుపులోకి తీసుకుని క్షుణ్నంగా తనిఖీ చేశారు. ఈ క్రమంలో చాక్లెట్‌ కవర్లలో ప్రత్యేకంగా ప్యాక్‌ చేసిన రూ.6 కోట్ల విలువైన వజ్రాలు, రాళ్లు గుర్తించారు. అలాగే వారి దగ్గర నుంచి రూ.9.83 లక్షల విదేశీ కరెన్సీ, రూ. లక్ష నగదును గుర్తించారు. సరైన ఆధారాలు చూపకపోవడంతో ఇద్దరు ప్రయాణికులను అదుపులోకి తీసుకున్నామని డీఆర్‌ఐ అధికారులు తెలిపారు.

ANN TOP 10