AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కాచిగూడ నుంచి అయోధ్యకు ఎక్స్‌ప్రెస్‌ రైలు..

ఉత్తరప్రదేశ్‌లో రామమందిర దర్శనానికి వెళ్తున్న ప్రయాణికుల కోసం నగరం నుంచి అయోధ్యకు ప్రతి శుక్రవారం రైలు సదుపాయం కల్పించారు. ఈనెల 22న అయోధ్యలో శ్రీరామ మందిర ప్రారంభోత్సవం జరుగుతున్న విషయం తెలిసిందే. యశ్వంత్‌పూర్‌ – గోరఖ్‌పూర్‌ (నెంబర్‌ 15024) ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రతి గురువారం రాత్రి 11.40 గంటలకు యశ్వంత్‌పూర్‌లో బయలుదేరి శుక్రవారం ఉదయం 10.40 గంటలకు కాచిగూడ రైల్వేస్టేషన్‌ చేరుతుంది. 10.50 గంటలకు కాచిగూడలో బయలుదేరి కాజీపేట, బలార్షా, నాగాపూర్‌(Kazipet, Balarsha, Nagapur), ఇటార్సీ, భోపాల్‌, ఝాన్సీ, కాన్పూర్‌, లక్నో మీదుగా శనివారం సాయంత్రం 4.25 గంటలకు అయోధ్య ధామ్‌ రైల్వే స్టేషన్‌ చేరుకుంటుంది. అక్కడి నుంచి గోరఖ్‌పూర్‌ వెళ్తుంది.

ANN TOP 10